మియాపూర్, ఆగస్టు 21 : చిన్నా పెద్దా అందరికీ ఆహ్లాదం పంచేలా పార్కును ఆహ్లాదంగా సుందరీకరిస్తామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. పచ్చదనంలో కళకళలాడేలా వనాలుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట చెరువు వద్ద పార్కు సుందరీకరణ పనులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి విప్ గాంధీ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు ఆట పరికరాలు, యువతకు ఓపెన్ జిమ్, పెద్దలకు వాకింగ్ ట్రాక్ వంటి వసతులను పూర్తి స్థాయిలో కల్పించామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా పార్కులను అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి వసతులపరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతామన్నారు. శేరిలింగంపల్లి డివిజన్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై డివిజన్ అధ్యక్షుడు రాజుయాదవ్ ఆధ్వర్యంలో పార్టీ అనుబంధ సంఘాలు విప్ గాంధీని మియాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేశ్, పార్టీ నేతలు రవియాదవ్, రవీందర్, రమేశ్, కృష్ణ, రాంబాబు, వేణు, రమణయ్య, చైతన్య, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.