e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home హైదరాబాద్‌ పనులు సకాలంలో పూర్తవ్వాలి

పనులు సకాలంలో పూర్తవ్వాలి

పనులు సకాలంలో పూర్తవ్వాలి

మియాపూర్‌, జూలై 14 : మియాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని సితార గ్రాండ్‌ నుంచి ఖాయిదమ్మ కుంట వరకు రూ. 8 కోట్లతో నిర్మిస్తున్న నాలా పనులలో అసంపూర్తిగా మిగిలిన పనులపై జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ జనప్రియ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌, హేమదుర్గా అపార్టుమెంట్‌ వాసులు కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌లతో కలిసి విప్‌ అరెకపూడి గాంధీ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నాలా పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏండ్ల తరబడి రెండు అసోసియేషన్ల మధ్య నెలకొన్న సమస్యను సమన్వయంతో పరిష్కరించి పనులను పునఃప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

నాలా విస్తరణకు ఇరు వర్గాలు తమ అంగీకారాన్ని తెలపటం సంతోషకరమని, భవిష్యత్‌లో ముంపు సమస్య పునరావృతం కాకుండా పనులను చేపడతామని విప్‌ గాంధీ హామీ ఇచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో పనులను వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని ఆయన సూచించారు. ప్రత్యేక కార్యాచరణతో వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ చిన్నారెడ్డి, ఈఈ శ్రీకాంతి, డీఈ సురేశ్‌, ఏఈ ధీరజ్‌, ప్రాజెక్టు డీఈ హరీశ్‌, ఏఈ శివకృష్ణ, ఏసీపీ సంపత్‌, హఫీజ్‌పేట్‌ పార్టీ అధ్యక్షుడు గౌతమ్‌ గౌడ్‌, జనప్రియ వాసులు ప్రవీణ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, మీనాక్షి, వెంకటేశ్వర్‌రావు, గురు ప్రసాద్‌, రాజశేఖర్‌, చక్రపాణి, హేమదుర్గ పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పనులు సకాలంలో పూర్తవ్వాలి
పనులు సకాలంలో పూర్తవ్వాలి
పనులు సకాలంలో పూర్తవ్వాలి

ట్రెండింగ్‌

Advertisement