మియాపూర్, జూన్ 25 : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి పథకం ద్వారా మంజూరైన రూ. 1.54 లక్షల విలువైన చెక్కులను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పపపాటి శ్రీకాంత్‌లతో కలిసి విప్ అరెకపూడి గాంధీ శుక్రవారం వివేకానందనగర్‌లోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని, దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సహాయం అందేలా అధికారులతో సమీక్షిస్తున్నట్లు విప్ గాంధీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కొండాపూర్ ఏరియా దవాఖానలో రోగుల సౌకర్యార్థం లిఫ్ట్ ఏర్పాటుకు రూ. 23 లక్షల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. రోగుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని తన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయటం పట్ల జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ అభివృద్ధికి గాను రూ. 1,20,70,000 నిధులతో పలు అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ శుక్రవారం తెలిపారు. అడ్డగుట్ట, నిజాంపేట కమాన్, ప్రశాంత్‌నగర్, గౌతమి నగర్ ప్రాంతాలలో సీసీ రోడ్లు, వరద నీటి కాలువ పనులు, మురుగు నీటి కాలువ పనులకు శనివారం శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ దత్తత హైదర్‌నగర్ డివిజన సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ఇందుకోసం అధిక నిధులను మంజూరు చేయిస్తూ అభివృద్ధికి బాటలు వేయిస్తున్నట్లు విప్ గాంధీ తెలిపారు.