Hyderabad | అక్రమ వసూళ్ల ఆరోపణలు.. మియాపూర్ సర్కిల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్
పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
హైదరాబాద్, ఆగస్టు 25 : పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మియాపూర్ సర్కిల్ సిటిజన్ సర్వీస్ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ అలియాస్ గడ్డం శ్రీనుపై వేటు పడింది. కంప్యూటర్ ఆపరేటర్ గా విధులలో చేరి టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏండ్లుగా తిష్టవేసిన ప్రవీణ్, గతంలో పలుమార్లు బదిలీ అయిన చక్రం తిప్పి ఇక్కడికే చేరాడు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులను మచ్చిక చేసుకుని నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సుమారు రెండు దశాబ్దాలుగా ఇదే విభాగంలో కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లాయి.
ఈ ఫిర్యాదులపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నివేదికను సమర్పించారు. నివేదిక ఆధారంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ చర్యలు తీసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా అతడు చేరిన ఏజెన్సీ నుంచి సైతం తొలగించాలంటూ లేఖ రాశారు. అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

