ఫొటోలో కనిపిస్తున్న ఈ బాలుడు గురువారం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాహీన్‌నగర్‌లో తిరుగుతుండగా, స్థానికులు గమనించి.. పోలీసులకు అప్పగించారు. వివరాలు అడిగితే తన పేరు ముదాసిర్ అని..తల్లి పేరు ఫాతిమా బేగం అని చెప్పాడు. ఇతర వివరాలు తెలుపలేదు. బాలుడి కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు.