కాచిగూడ,ఆగస్టు 15: గోరఖ్‌పూర్ రైల్లో ప్రయాణిరాలి నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం.. బెంగళూర్‌లోని సిరిపురం ప్రాంతానికి చెందిన ఫైజ్ఖాన్ భార్య రేహన(37)గోరఖ్‌పూర్ రైల్లో కాచిగూడకు వస్తుండగా మార్గమధ్యలో ధర్మవరం రైల్వేస్టేషన్ సమీపంలో ఆమె బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.
అందులో రూ.2 వేల రూపాయాలు, క్రెడిట్, డెబిట్,ఆధార్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి బాధితురాలి ఫిర్యాదు మేరకు కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని, తదుపరి విచారణ నిమిత్తం ధర్మవరం రైల్వే పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేసినట్లు కాచిగూడ రైల్వే సీఐ తెలిపారు.