మారేడ్‌పల్లి, అక్టోబర్ 19 : సనత్‌నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్లో పాదయాత్ర ద్వారా ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం ప్రచారం మోండా డివిజన్లోని బండిమెంట్, మారుతివీధి, నాలాబజార్, ఓల్డ్ జైల్‌ఖానా తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బతుకమ్మలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. స్థానిక మహిళలు మంగళ హారతులు ఇచ్చి మంత్రికి బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా అపార్ట్మెంట్ల పై నుంచి మహిళలు, యువత మంత్రిపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు బస్తీ, కాలనీల్లో అభివృద్ధి చేసి, తమ బతుకుల్లో వెలుగులు నింపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని బీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని బస్తీ వాసులు తెలిపారు.
పాదయాత్ర ప్రచారంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజల్ లకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని 10 సంవత్సరాల కాలంలో చేశానన్నారు. గతంలో ఇక్కడి నుంచి గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా చేసిన వారు సైతం చేయలేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో కోట్ల రూపాయాల నిధులు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. గతంలో బస్తీ, కాలనీల్లో డ్రైనేజీ, రోడ్లు అస్థవ్యస్తంగా ఉండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన తరువాత పాత డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌ను తొలగించి.. నూతన పైప్‌లైను వేసి సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.
సనత్‌నగర్‌లో తాను చేసిన అభివృద్ధి ప్రస్తుతం కండ్ల ముందు కనబడుతుందని తెలిపారు. ముమ్మాటికి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు చూపెడుతున్న ఆదరణ చూస్తుంటే భారీ మెజార్టీతో ఘన విజయం ఖాయమని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్, కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, హేమలత, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, నామన శేషు కుమారి, కిరణ్మయి, డివిజన్ పార్టీ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్‌రెడ్డి, గుర్రం పవన్ కుమార్, అత్తిలి శ్రీనివాస్‌గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకు లుతలసానని స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, జయరాజ్, ఓదెల సత్యనారాయణ, సంతోష్, కరుణాకర్‌రెడ్డి, మహేశ్, మహేందర్ పాల్గొన్నారు.
ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలకు ప్రజలు గుర్తుకు వస్తారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్లో పాదయాత్ర ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం (మొదటి రోజు) ప్రచారం మోండా డివిజన్లోని బండిమెంట్, మారుతివీధి, నాలాబజార్, ఓల్డ్ జైల్‌ఖానా తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనే దేశంలోనే బీఆర్ఎస్ ముందుందని అన్నారు. మాయ మాటలతో ప్రజల వద్దకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మబోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 50 సంవత్సరాల పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వమని అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్ననాడే ప్రజలకు మేలు చేయలేని వారు.. ఇప్పుడు గ్యారెంటీ, వారంటీలు అంటూ వస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ర్టానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్ని నిధులు తీసుకోచ్చారో చెప్పాలని అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, మూడో సారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని చెప్పారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయాల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. 50 సంవత్సరాల కాలంలో ఏవరూ చేయని అభివృద్ధి పనులు 10 సంవత్సరాల కాలంలో తాను చేశానని వెల్లడించారు.
అమీర్‌పేట్ : దసరా నవరాత్రుల్లో భాగంగా సనత్‌నగర్ నీమ్కర్నగర్లోని పటేదార్ భవన్లో జరుగుతున్న వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపుతో హైదరాబాద్ అలరారుతోందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పటేదార్ సమాజం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికి ఆశీర్వదించాలని కోరారు. మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, అమీర్‌పేట్ వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రాజ్‌పురోహిత్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు, గులాబ్‌సింగ్‌తో పాటు గుజరాతి సమాజం ప్రతినిధులు హన్స్‌రాజ్ పటేల్, చైన్‌సింగ్, మోహన్ పటేల్ పాల్గొన్నారు.