మారేడ్‌పల్లి : సీఎం కేసీఆర్ బీసీ కులాల సంక్షేమానికి అనేక వినూత్న పథకాలు ప్రవేశ పెట్టారని..అర్హులైన అన్ని బీసీ కులాలకు ఆత్మ గౌరవ భవనాలకు స్థలాలు నిధులు కేటాయించేందుకు సుముఖంతో ఉన్నారని వంజరి కులస్తులకు కూడా తప్పకుండా ఆత్మగౌరవ భవనము కేటాయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
ఆదివారం మారేడ్‌పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర వంజరి సేవ సంఘం క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. వంజరి కులస్థులను ఎస్టీ లలో చేర్చాలని వంజరి కులానికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, నామినేటేడ్ పదవుల్లో తమ కులస్తులకు ప్రాతినిథ్యం ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎదుగని శంకర్ నారాయణ, , కృష్ణ, సురేష్ కాలేరు. రాపా జ్యోతి కాలేరు. నర్సింగ్‌రావు, సూర్యనారాయణ, శివకుమార్, గోపాల్, కాశీనాథ్ , సామాల భాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.