
బన్సీలాల్‌పేట్, జూలై 5: నగరంలోని బస్తీల రూపరేఖల ను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బన్సీలాల్‌పేట్ డివిజన్ న్యూబోయిగూడలోని గొల్ల కొమరయ్య కాలనీలో రూ.85 లక్షలతో నిర్మించిన పది డబుల్ బెడ్రూమ్ ఇండ్లను హోం శాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ప్రజల సమక్షంలో లాటరీ పద్ధ్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇంటి తాళాలను, ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భం గా మంత్రి తలసాని మాట్లాడుతూ 50 ఏండ్లుగా కనీస సదుపాయాలు లేకుండా జీవించారని, ఇకపై అలాంటి బాధలు లేకుండా బస్తీవాసుల కష్టాలు తొలగిపోయాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, తాసీల్దార్ బాలశంకర్, జీహెచ్ఎంసీ హౌసిం గ్ ఈఈ ఎం.వెంకట్‌దాస్‌రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కే.లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొల్లకొమరయ్య కాలనీ అభివృద్ధి, సంక్షేమ సంఘం అధ్యక్షుడు కే.ఎమ్.కృష్ణ, కార్యదర్శి ఈ.నర్సింగ్ రావు, మణికంఠ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్, టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి ఈ.మనీశ్ కుమార్ ఆధ్వర్యం లో బ్యాండు మేళాలతో, పూలుజల్లుతూ మంత్రులు మహమూద్ అలీ, తలసాకి ఘనంగా స్వాగతం పలికారు.