
అంబర్‌పేట, జూలై 2: హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్, బాపూనగర్ ప్రాంతాలలో శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ ఇ. విజయ్కుమార్గౌడ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
అనంతరం మాట్లాడుతూ అంబర్‌పేటలో ఉన్న అతి పెద్ద నాలా సమస్య పరిష్కారానికి రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ సమస్యతో పాటు పర్యావరణాన్ని పెంపొందించిన వారమవుతామని, అంతేగాక అంటువ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రతతో పాటు పచ్చని వాతావరణాన్ని కల్పించడానికి హరితహారం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీ వేణుగోపాల్, ఏఎంఓహెచ్ హేమలత, డీఈ చంద్రశేఖర్, ఏడీ గణేశ్‌రావు, సత్యశంకర్, డీఈ సంతోష్, ఏఈలు కుశాల్, శ్వేత, మల్లేశ్, డీడీ మాలిని, శ్రీధర్, మాజీ కార్పొరేటర్ దిడ్డి రాంబాబులతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు