మలక్‌పేట, డిసెంబర్ 21 : అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలనను అందిస్తున్నారని షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని బాప్టిస్టు చర్చి భవన నిర్మాణానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ మాసం క్రైస్తవులకు ఎంతో పవిత్రమైందన్నారు. ఈ మాసంలో చర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవటం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచి దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. క్రైస్తవులు, మైనార్టీల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని వర్గాలను సమానంగా ఆదరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న క్రైస్తవ భవన నిర్మాణస్థలం వివాదంలో ఉన్న కారణంగా కొంత ఆలస్యమైందన్నారు. త్వరలోనే రూ.10 కోట్లతో క్రిష్టియన్ల ఆత్మగౌరవ భవనం నిర్మించనున్నామని ఆయన తెలిపారు. మీ అండదండలు ప్రభుత్వానికి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కార్పొరేటర్ భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి, చర్చి కమిటీ అధ్యక్షుడు వీఎస్.ఇజ్రాయేల్, ఉపాధ్యక్షుడు, కె.బాబూరావు, కార్యదర్శులు టి.నవీన్, జోసెఫ్, సంగీతరావు, కోశాధికారి ముడి జోసెఫ్, బిల్డింగ్ ఫండింగ్ చైర్మన్ ఆర్.శ్రీనివాస్, యూత్ డైరెక్టర్ సీహెచ్ క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.