Minister Talasani | మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం : మంత్రి తలసాని
Minister Talasani | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ.. వైద్య రంగంలో ఆశ వర్కర్లు(Asha workers), గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ లో అంగన్వాడీ టీచర్లు(Anganwadi) అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలు, స్థానిక సంస్థలు, చట్ట సభలలో మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారి హక్కులను కాపాడుతున్నట్లు చెప్పారు. తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారం అందిస్తుందన్నారు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత అంగన్ వాడీల వేతనాన్ని మూడువందల శాతానికి పెంచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ అధికారి సునంద, నోడల్ అధికారి రాజేందర్, కార్పొరేటర్ దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డీసీ ముకుంద రెడ్డి, సఖి కేంద్రం అధికారి అనితా రెడ్డి, యూసీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ నీరజ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

