ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
బేగంపేట్ మార్చి 26: హుస్సేన్‌సాగర్ తీరాన నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ థీమ్‌పార్కులో సమ్మర్ కార్నివాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలి రావడంతో థ్రిల్ సిటీ సందడిగా మారింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కేక్ కట్‌చేసి, సమ్మర్ కార్నివాల్ లోగో, ఆన్లైన్ బుకింగ్‌ను ప్రారంభించారు. దీంతో పాటు థ్రిల్ సిటీకి వచ్చే వారికి అందజేసే లక్కీ కూపన్‌ను విడుదల చేశారు. జూన్ 12 వరకు సమ్మర్ కార్నివాల్ కొనసాగుతుందని తెలిపారు. పిల్లలకు రూ.699, పెద్దలకు రూ. 999 థ్రిల్ సిటీ ప్రవేశంతో పాటు అన్ని రైడ్స్‌ను ఉచితంగా అనుమతించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్‌యాదవ్, డైరెక్టర్లు రజినీకాంత్, అనిల్, బాలరాజ్, అబ్రహం, హిమాన్షు , ప్రభు తదితరులు పాల్గొన్నారు.