హైదరాబాద్: మహిళలంటే సమాజంలో ఇంకా చిన్న చూపు చూస్తున్నారని, సెకండ్ గ్రేడ్ వర్కర్లా చూస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పురుషులు, మహిళలు అందరికీ సమానత్వం ఉండాలని తెలిపారు. మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలని, ఆపదలో ఉన్న మహిళలు, అమ్మాయిలను ఆదుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజాలో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యాక్షన్ పేరుతో 2కే, 5కే రన్ నిర్వహించారు. మంత్రి సీతక్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల వ్యక్తిత్తం వికాసం కోరుకోవాలని, సమాజంలో వారిని ఎదగనిద్దామని, కాపాడుదామన్నారు. మహిళలకు ప్రభుత్వం నుంచి అమలయ్యే అన్ని హమీలను అందిస్తామని చెప్పారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళల ఎదుగుదల, గుర్తింపు కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మహిళలు కష్టాలు అధిగమించి ముందుకు వెళ్లాలని, మహిళ భద్రత తమ బాధ్యత అని చెప్పారు. మంత్రి సీతక్క ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నేడు మనముందు నిలబడ్డారని వెల్లడించారు. మహిళలు, అమ్మాయిల కోసం సిటీ పోలీస్, షీ టీమ్స్ ఎన్నో భద్రతా చర్యలు తీసుకున్నాయన్నారు.
#WATCH | Telangana | As a part of International Women’s Day, the Hyderabad City Police organises Run For Action-2025 program in People’s Plaza, Necklace Road, Hyderabad. pic.twitter.com/CR5zXjE9zb
— ANI (@ANI) March 8, 2025