ఆర్కేపురం/బడంగ్‌పేట,, జూలై 23: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్‌నగర్ డివిజన్లో బోనాల సందర్భంగా ఆదివారం పోచమ్మ దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం, ఎస్.వి.ఆర్. ఎస్. బృందావనంలోని మైసమ్మ దేవాలయం, భగత్‌సింగ్‌నగర్, శంకర్‌నగర్ కాలనీలోని అమ్మవార్ల దేవాలయంలోని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోనాలు మన సంస్కృతిలో ఓ భాగమని, పండుగలను ప్రజలందరు కలిసిమెలసి జరుపుకోవాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. తన నియోజకవర్గంలోని దేవాలయాలను సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిధులు తీ సుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానని చెప్పా రు. అనంతరం పలు ఆలయాల ప్రతినిధులు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బాలకిషన్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, అంకిరెడ్డి, రామ్‌చందర్, లోడి నర్సింహగౌడ్, రాజయ్య, కిరణ్ కుమార్, యాదయ్య యాదవ్, ఎల్లయ్య యాదవ్, సుదర్శన్ ముదిరాజ్, రాఘవేంద్రగుప్తా తదితరులు పాల్గొన్నారు.
మీర్‌పేటలో ఆదివారం బోనాల ఉత్సవాలు జరిగా యి. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి మహిళతో కలిసి బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ తీగల నితీశ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె పాండు గౌడ్, తీగల హరినాథ్ రెడ్డి, తీగల అమర్ నాథ్ రెడ్డి, కార్పొరేటర్ అక్కి మాదవి తదితరులు అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.