
కందుకూరు, జూలై 5 : యాదాద్రి పాజెక్టు పూర్తి అయి తే విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం లో ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండలకేంద్రంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రాంగణంలో రూ.1.67 కోట్లతో నిర్మించే డివిజన్ విద్యుత్ కార్యాలయ భవనానికి సోమవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్యు త్ సరఫరాను గుర్తించిన పరిశ్రమలు, సంస్థలకు రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. సమైఖ్య రాష్ట్రంలో విద్యుత్ కోసం రైతులు రోడ్లు ఎక్కి ధ ర్నాలు చేసేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌తో పాటు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. భవిష్యత్ తరలకు విద్యుత్ కొరత లేకుండా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో జంట జిల్లాలలో ప్రతి ఎకరాకు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. కందుకూరులో మంత్రి మా ట్లాడుతూ.. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని భూములను కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి నీరందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఒకప్పుడు సాగు, తాగునీరు లేక తెలంగాణ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ సా గునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీయర్ ఆనంద్, ఎస్ఈ గోపయ్య, డీఈ హన్మంత్‌రెడ్డి, ఏడీలు వెంకటేశ్‌గౌడ్, శ్రీనివాస్, ఏఈలు రమేశ్‌గౌడ్, గోపయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీపీ జ్యోతీపాండు, జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, స్థానిక సర్పంచ్‌లు సాధ మల్లారెడ్డి, శమంతకమణి, రామకృష్ణారెడ్డి, భూపాల్‌రెడ్డి, సదాలక్ష్మి, కల మ్మ, పరంజ్యోతి, ఎంపీటీసీలు జ్యోతి, ఇందిరమ్మ, బీజే పీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు జయేందర్, మండల ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, డైరెక్టర్లు సామ ప్రకాష్‌రెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, తాసీల్దార్ జ్యోతి, ఎండీవో కృష్ణకుమారి, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.