
ఆర్కేపురం, జూలై 3 : నాణ్యతతో కూడిన నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అవసరమైన చోట్ల తాగునీటి పైపులైన్ల సామర్థ్యాన్ని పెంచి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు. శనివారం సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్ల పరిధిలో తాగునీటి సరఫరా తీరును జలమండలి అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాత లైన్ల స్థానంలో కొత్త పైపులైన్లను, మరికొన్ని చోట్ల మరమ్మతులను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్కేపురం డివిజన్ పరిధిలో ఎన్టీఆర్నగర్, గ్రీన్‌హిల్స్ కాలనీలో, సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో డాక్టర్స్ కాలనీ, వెం కటేశ్వరకాలనీ, జింకలబావి కాలనీ, క్రాంతినగర్, గణేశ్ మండలపం, చేరుకుతోట కాలనీ, పోచమ్మబాగ్ కాలనీ, శ్రీనివాసకాలనీ, ఎరుకుల బస్తీ, భగత్‌సింగ్‌నగర్, అంబేద్కర్‌నగర్‌లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పొల్యూషన్ ఉన్నచోట పైపులైన్ల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.
రెండు డివిజన్ల పరిధిలో తాగునీటి సరఫరాను కూడా మెరుగుపరుచాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలను రూపొందిస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సమీక్షలో జలమండలి జనరల్ మేనేజర్ వినోద్ భార్గవ్, డీజీ ఎం సరిత, మేనేజర్లు రామకృష్ణ, లెనిన్, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్, ఆకుల అరవింద్‌కుమార్, నాయకులు దయాకర్‌రెడ్డి, సాజిద్, అశోక్, కేశవరెడ్డి, పాల్గొన్నారు.