బడంగ్‌పేట, జూన్3 : పది రోజుల్లో ట్రంక్ లైన్ పనులు పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి.. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ట్రంక్ లైన్ పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాగే మీర్‌పేట పెద్ద చెరువు సుందరీకరణ పనులు మొదలు చేపట్టాలని, చెరువు కట్ట విస్తరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ ఈఈ రమేశ్‌కుమార్, డీఈ ధన్మోహన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.