బడంగ్‌పేట, అక్టోబర్ 29 : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తిచేయాలని మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్, డీఈ గోపీనాథ్, ఏఈ శ్రీనివాస్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు డివిజన్ల వారిగా జరిగిన అభివృద్ధి పనులపై మంత్రి ఆరా తీశారు. కాలనీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద కాల్వల నిర్మాణం, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, చెరువుల సుందరీకరణపై చర్చించారు. నిర్లక్ష్యం చేయకుండా.. టెండర్ అయిన పనులను త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు రావల్సిన బకాయిలు, పన్నులను వసూలు చేయాలని సూచించారు. పాలక వర్గం, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అక్కి మాదవి ఈశ్వర్ గౌడ్, అరుణ ప్రభాకర్‌రెడ్డి, అర్కల భూపాల్‌రెడ్డి, నవీన్ గౌడ్, గజ్జల రాంచందర్, రవినాయక్, ముద్ద పవన్ కుమార్, ఏనుగుల అనిల్‌కుమార్ యాదవ్, తీగల మాదవి సాయినాథ్‌రెడ్డి, బాలమణి, రాజేందర్‌రెడ్డి, ధరంకారం జ్యోతి కిశోర్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, సిద్దాల బీరప్ప, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.