బడంగ్‌పేట, అక్టోబర్ 28 : సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ 8వ డివిజన్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారందరికి మంత్రి టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని ఆమె సూచించారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు.
నవంబర్ 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు పెద్ద సంఖ్యలో తరలాలని సూచించారు. పాత, కొత్త తేడా లేకుండా అందరు పార్టీని బలోపేతం చేయాలన్నారు. సమన్వయంతో పనిచేయాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత, కోఆప్షన్ సభ్యుడు జగన్ మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, బి అజయ్, డి శ్రీకాంత్, సందీప్, దుర్గా ప్రసాద్, సాయి, చింటు, రాహుల్, అర్జున్ తదితరులు ఉన్నారు.
కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భూపేశ్‌గౌడ్
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దిండు భూపేశ్‌గౌడ్ నియమితులయ్యారు. మంత్రి పి సబితారెడ్డి చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, టీఆర్ఎస్ మీర్‌పేట అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి, కార్పొరేటర్లు లావణ్య, అర్కల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.