మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ పట్టుబట్టి పూర్తి చేయించారని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు కేంద్రం పెంచుకుంటూ పోతుంటే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలలో ఎందుకు ధరలు పెంచుతున్నారో చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పి కొట్టవలసిన అవసరం ఉందన్నారు.
బడంగ్‌పేట, అక్టోబర్ 27 : కేంద్ర ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాలపై పెత్తనం చెలాయించాలని చూస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో నియోజక వర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం రామిడి రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కందుకూరు మండలం, మహేశ్వరం మండలం, తుక్కుగూడ మున్సిపాలిటీ, జల్పల్లి మున్సిపాలిటీ, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, మీర్‌పేట కార్పొరేషన్, ఆర్కే పురం, సరూర్‌నగర్ డివిజన్ల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సమావేశం ప్రాంగణం గులాబీ మయంగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాగు, తాగు నీరుకు కొదువలేకుండా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. మిషనర్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీళ్లు అందుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి మహిళలు ఓట్లు వేయవద్దని, ప్రజలకు వాస్తవాలను తెలియజేయవలసిన బాధ్యత ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధాలను అవలంభిస్తున్న బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకు పోవలసిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు. కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలన్నారు. నవంబర్ 15న వరంగల్‌లో జరిగే విజయ గర్జనకు పెద్ద ఎత్తున తరలి రావలసిన అవసరం ఉందన్నారు.
నియోజక వర్గం వ్యాప్తంగా అందరం బస్సులోనే ప్రయాణం చేద్దామని ఆమె అన్నారు. ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండాను ఎగురవేసి మండల కేంద్రానికి రావాలన్నారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రానికి వస్తే అక్కడి నుంచి బయలు దేరవలసి ఉంటుందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ.. కార్యకర్తలకు శిక్షణ తరగతులు పెట్టవలసిన అవసరం ఉందని సూచించారు. టీఆర్ఎస్ విధివిధానాలను తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. గతంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులను సీఎం కేసీఆర్ నిర్వహించే వారని ఆయన గుర్తు చేశారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్‌పేట మేయర్ దుర్గాదీప్‌లాల్ చౌహన్, నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్త మనోహర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి,
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, కందుకూరు టీఆర్ఎస్ అధ్యక్షుడు విజేందర్, మహేశ్వరం టీఆర్ఎస్ అధ్యక్షుడు రాజునాయక్, సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు మహేందర్ యాదవ్, ఆర్కేపురం టీఆర్ఎస్ ్ట అధ్యక్షుడు పెండ్యాల నాగేశ్, తుక్కుగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు జెల్లెల లక్ష్మయ్య, టీఆర్ఎస్ ్ట జిల్లా, నియోజకవ వర్గం నాయకులు, కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.