మహేశ్వరం,అక్టోబర్17 : గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోత్ రాజునాయక్ ఆధ్వర్యంలో ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్‌నాయక్, గంగారం సర్పంచ్ సాలీవీరానాయక్తో కలిసి నగరంలోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు చంద్రయ్య, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి జరుపుల రాజునాయక్, ఉపాధ్యక్షుడు రవినాయక్, ఎంపీటీసీ విజయ్‌కుమార్, దేవులనాయక్, ఈశ్వర్‌నాయక్ పాల్గన్నారు.
కందుకూరు, అక్టోబర్ 17 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షునిగా ఎన్నికైన మన్నే జయేందర్‌కు తన నివాసంలో నియామకపత్రం అందజేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ విజేందర్‌రెడ్డి, ఇందిరమ్మ, దేవేందర్, జయమ్మ, రాజు సురుసాని సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోర ం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆర్కేపురం, అక్టోబర్ 17 : టీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడిగా పబ్బు శ్రీనివాస్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వి.మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి సబితాఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.