ఆర్కేపురం, అక్టోబర్ 11 : టీఆర్ఎస్ ఆర్కేపు రం డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఊర్మిలారెడ్డి ఎంపికయ్యారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుందన్నారు.
టీఆర్ఎస్ కార్మిక విభాగం డివిజన్ అధ్యక్షుడిగా ఉద్యమకారుడు సోమరాజు శ్రీరాములు నియమితులయ్యా రు. మంత్రి సబితాఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను డివిజన్లోని ప్రతి కార్మికుడికి అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
మహేశ్వరం, అక్టోబర్ 11 : పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ నూతన కమిటీ నియామక సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునిత, సహకార బ్యాంక్ చైర్మన్ పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురసాని వరలక్ష్మి, మాజీ మండల అధ్యక్షుడు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షునిగా అంగోత్ రాజునాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వర్కల యాదగిరిగౌడ్, యువజన విభాగం అధ్యక్షుడిగా శ్రీను, ప్రధాన కార్యదర్శిగా రాఘవేందర్‌రెడ్డిలను ఎన్నుకున్నారు.