మహేశ్వరం, సెప్టెంబర్ 15 : గ్రామాల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం డబిల్‌గూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుతూ మంత్రికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పల్లెప్రగతితో గ్రామాల్లోని సమస్యలు తీరుతున్నాయన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతికి పాటుపడుతూ గ్రామాభివృద్ధిలో పాలుపంచుకున్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన డబిల్‌గూడ టీఆర్ఎస్ గ్రామ కమిటీని అభినందించారు. కార్యక్రమంలో డబిల్‌గూడ సీనియర్ నాయకులు రాములు, రవీందర్, ఇస్తారి, కర్ణాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు ధార జంగయ్య, యూత్ అధ్యక్షులు బ్రహ్మచారి, పాండు పాల్గొన్నారు.
సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని కల్వకోల్‌కు చెందిన గడ్డం కృష్ణకు సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మంజూరైన రూ. 60వేల చెక్కును మంత్రి తన నివాసంలో గ్రామ సర్పంచ్ థామస్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొజ్జం చంద్రయ్య తదితరులు ఉన్నారు.
పహాడీషరీఫ్, సెప్టెంబర్ 15 : సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఎంతగానో ఆదుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన పెంటయ్యకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.60 వేల చెక్కును బుధవారం మంత్రి తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో జల్పల్లి కో-ఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ టీఆర్ఎస్ ఎస్సీసెల్ ప్రధానకార్యదర్శి యంజాల జనార్దన్, పార్టీ నాయకులు జంగారెడ్డి, గోపాల్‌రెడ్డి, నగేశ్ ముదిరాజ్, వై.రవి, అనూశ్గౌడ్, సత్తిరెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకుడు అర్జున్ తదితరులు పాల్గొన్నారు.