కందుకూరు, ఆగస్టు 27 : సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కా ర్యాలయంలో ఎంపీపీ మంద జ్యోతిపాండు అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి 20 అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై ప్రశ్నలు లెవనెత్తారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పల్లె ప్రగతిలో గుర్తించిన శ్మశానవాటిక, డంపింగ్ యార్డుల నిర్మాణాలను త్వర గా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ట్రాక్టర్లో వేసేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. బృహత్తర మండల ప్రకృతి వనాన్ని మాదాపూర్‌లో కాకుండా మినీస్టేడి యం పక్కన ఏర్పాటు చేయాలన్నారు.
గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు ఏవిధంగా ఉన్నాయో గ్రా మాల్లో పర్యటించి నివేదికను ఇవ్వాలని ఎండీవో కృష్ణకుమారిని ఆదేశించారు. పక్కా పంచాయతీ భవనాలు లేని గ్రామాలకు పంచాయతీ భవనాలు మం జూరు చేస్తామన్నారు. ఫాంల్యాడ్ల వ్యాపారులు అ క్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారని ఈ విషయం లో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మండల కేంద్రంలో నూతనంగా ఇండ్లు నిర్మించుకుంటున్న కాలనీల్లో విద్యుత్ వసతిని కల్పించాలని, అభివృద్ధి పనుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ని ర్లక్ష్యం చేయొద్దన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శమంతకమణి, వైఎస్ ఎంపీపీ శ మంత, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఆర్డీవో వెం కటాచారి, ఎంపీడీవో కృష్ణకుమారి, తహసీల్దార్ జ్యో తి, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, విద్యుత్ డీఈ రాజారాంరెడ్డి, జగన్మోహన్రెడ్డి, మండలస్థాయి అధికారులు, సర్పంచ్‌లు, రా మకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, సదాలక్ష్మీపుల్లారెడ్డి, పరంజ్యో తి, భూపాల్‌రెడ్డి, కళమ్మ, నరేందర్‌గౌడ్, ఇందిరమ్మ, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్, గోవర్ధన్, శ్రావణి, జ్యోతి, ఎంపీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాములు, యాదయ్య, రేఖ, బొక్క జ్యోతి, బాల్‌రాజ్, యాదయ్యలు వివిధ గ్రామాల ఎంపీటీసీలు, పాల్గొన్నారు.
ఆర్కేపురం, ఆగస్టు 27 : పార్టీ పటిష్టత కోసం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పెండ్యాల నగేశ్‌ను నియమిస్తూ శుక్రవారం మం త్రి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు పొందాలన్నారు. ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ల నుంచి 2వేల మంది డబుల్బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకన్నారని, అందులో అర్హత కలిగిన వారికి ఇండ్లు ఇప్పించి న్యాయం చేస్తామన్నారు. భవిష్యత్ రాజకీయాల్లో యువత ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, అందులో భాగంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండటంతో 14వేల కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. ప్రతి పక్షపార్టీల నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం దొంగదీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలు వారికి తగిన బుద్ధిచెబుతారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, నియోజకవర్గ పార్టీ ప్రధానకార్యదర్శి బాలకిషన్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అరవింద్, ఖిల్లా మైసమ్మ ఆలయ చైర్మన్ శ్రీనివాస్, నియోజకవర్గ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సునీతారెడ్డి, నాయకులు రామాచారి, సాజిద్, శ్రీనివాస్‌రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, పెంబర్తి శ్రీనివాస్, రమేశ్, రమేశ్ కుర్మ, ఊర్మిలారెడ్డి, సుజాతారెడ్డి, పుష్షలతారెడ్డి, లింగస్వామిగౌడ్, జాహెద్, వెంకటేశ్‌గౌడ్, శేఖర్, పరీద్ పాషా తదితరులు పాల్గొన్నారు.