కందుకూరు, పహాడీషరీఫ్ ఆగస్టు 23 : నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ నాయకుడు, అగర్మియగూడ మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, పాండులతో కలిసి అగర్మియగూడ గేటు నుంచి గ్రామం వరకు డబుల్ రోడ్డును మంజూరు చేయాలని కోరుతూ, సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నిధులను మంజూరు చేసి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామాలకు కావాల్సిన నిధులను కేటాయించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. గ్రామాలకు సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజీ పనులకు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్‌రెడ్డి, అశోక్, యాదగిరిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములు, పెద్దిరాజు పాల్గొన్నారు.
అంగన్వాడీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి
శ్రీరామకాలనీలోని 18వ వార్డులో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ మంత్రిని కోరారు. సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నదన్నారు. 18వ వార్డులో అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు దిశగా మంత్రి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ పల్లపు శంకర్ పాల్గొన్నారు.