బడంగ్‌పేట, ఆగస్టు21 : అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1, 2, 3, 4, 5, 21, 22, 32 డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. బడంగ్‌పేట నుంచి అల్మాస్గూడ వరకు, అల్మాస్గూడ హైమాత టెంపుల్ నుంచి స్వేచ్ఛ నివాస్ వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కాలనీల్లో మంత్రి మొక్కలు నాటారు. శ్రీహిల్స్లో ఉన్న పార్కు స్థలాన్ని కాపాడాలని మంత్రికి కాలనీ వాసులు వినతిపత్రం అందజేశారు. కాలనీల్లో ఉన్న సమస్యలను కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్‌రెడ్డి, సంరెడ్డి స్వప్న వెంకట్‌రెడ్డి మంత్రికి వివరించారు. అనంతరం వినాయక హిల్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అధ్యక్షత వహించారు.
భవిష్యత్ తరాల కోసం పార్కులను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు. అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారని ఆమె అన్నారు. కాలనీల్లో తాగునీటి పైపులైన్స్ పూర్తి చేసిన తర్వాత నీటి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. నీటి సమస్యను పరిష్కరించడానికి శివారు ప్రాంతాలకు రూ.1200కోట్లు కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మహేశ్వరం నియోజక వర్గానికి రూ.230 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
బడంగ్‌పేటలో మూడు రిజర్వాయర్స్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. రిజర్వాయర్స్, పైపులైన్ పనులు పూర్తి కాగానే కాలనీలకు నీటి సరఫరా చేయిస్తామన్నారు. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు రూ.3 కోట్లతో శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ. 23 కోట్లతో ట్రంక్‌లైన్ ఏర్పాటు, బాలాపూర్ మండలపరిధిలో ఉన్న 42 గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయనున్నామన్నా రు. పారిశుధ్యంపై దృష్టి సారించామని ఆమె అన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా కాలనీ అసోసియేషన్ సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు.బడంగ్‌పేటలో 100 పడకల దవాఖాన, ఇంటి గ్రేటెడ్ మార్కెట్, జిల్లా గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్న వెంకట్‌రెడ్డి, దీపిక శేఖర్‌రెడ్డి, రామిడి మాదురి వీరకర్ణారెడ్డి, లిక్కి మమతాకృష్ణారెడ్డి, సూర్ణ గంటి అర్జున్, బీమిడి స్వప్న జంగారెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్‌రెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, డీఈ అశోక్ రెడ్డి పాల్గొన్నారు.