మహేశ్వరం, ఆగస్టు 20 : గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తీజ్ పండుగకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని హర్షగూడ గ్రామంలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా, దీపావళి, బతుకమ్మ పండుగలకు ఎలాగైతే సెలవులు ప్రకటిస్తారో అదే తరహాలో తీజ్ పండుగకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేవిధంగా కృషిచేస్తానని అన్నారు. గిరిజనులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు హనుమగల్ల చంద్రయ్య, సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ పాండునాయక్, ఎంపీటీసీ విజయ్‌కుమార్, ఉపసర్పంచ్ రవినాయక్, సర్పంచ్‌లు శివిరాజునాయక్, మోతీలాల్‌నాయక్, మెగావత్ రాజునాయక్, సాలీ వీరానాయక్, నాయకులు దోమ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఏ సమీర్, నవీన్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం, ఆగస్టు 20 : గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బురమోని నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మంత్రి సబితారెడ్డిని కలిశారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరుచేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వారిని గ్రామాభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా కృషిచేయాలని తెలిపారు. గ్రామాభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందిరమేశ్, మురళీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జాన్‌రెడ్డి, మల్లేశ్ యాదవ్, సీతారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.