బడంగ్‌పేట,అక్టోబర్9: ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ శివారు ప్రాంతాలకు రూ.830 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్, 24వ డివిజన్, 30 డివిజన్, 20వ డివిజన్‌తో పాటు మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథీలానగర్, సత్యసాయినగర్, ఎంఎల్ఆర్ కాలనీ, లెనిన్ నగర్, తదితర కాలనీలలో పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. అనంతరం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బాలాపూర్ మండలంలో ఉన్న 42 చెరువులను అనుసంధానం చేస్తూ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
సీవరేజి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ.3500 కోట్లు, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో చెరువులను అనుసంధానం చేయడానికి నాలా అభివృద్ధికి రూ.68 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెల 30న టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ చెరువులను అనుసంధానం చేస్తు నాలాలను అభివృద్ధి చేయడానికి రూ.18.36 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, మీర్‌పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్లు డి శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్‌రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, ముత్యాల లలిత కృష్ణ, బీమిడి స్వప్న జంగారెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.