కందుకూరు, ఆగస్టు 22 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ క్రమంలో ఉనికి దెబ్బతింటుందనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని జైత్వారం గ్రామంలో ఆదివారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి నెలా నిధులను విడుదల చేస్తు అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే తమ ఉనికి దెబ్బతింటుందని ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని ఉద్ఘాటించారు. జైత్వారం గ్రామాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబైరు సదాలక్ష్మి, టీఆర్ఎస్ మండల నాయకులు పుల్లారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నాయకులు జయేందర్, వెంకట్‌రెడ్డి, భోజిరెడ్డి, దామోదర్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, పాండు, సామయ్య, దీక్షిత్‌రెడ్డి పాల్గొన్నారు