శామీర్‌పేట, జూలై 17: కలిసికట్టుగా పనిచేసి గ్రామీణ ప్రాంతాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్‌పేట మండలంలోని బాబాగూడ, బొమ్మరాశిపేట, పొన్నాల్ గ్రామాల్లో సోమవారం పర్యటించి పలు కాలనీల్లో మంత్రి పాతయాత్ర చేశారు. ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పనపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు అవసరమున్న ప్రతి చోట ఏర్పాటు చేస్తానమన్నారు. తన సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డికి సూచించారు. అదే విధంగా పొన్నాల్‌లో పోచమ్మ ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు సుదర్శన్, ఎంపీపీ ఎల్లూభాయిబాబు, సర్పంచ్‌లు లతారవీందర్, గీతమహేందర్, సుకన్య సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీలు మౌనికవీరప్రసాద్, ఇందిర, డైరెక్టర్లు వేణుగౌడ్, విజయలక్ష్మి, భూమిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి ప్రభాకర్, మండల యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు, కో ఆఫ్షన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
శామీర్‌పేట మండలంలో మంత్రి మల్లారెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని సర్పంచ్‌లు గుర్క కుమార్‌యాదవ్, సరసం మోహన్‌రెడ్డి కోరారు. మండలంలోని మజీద్‌పూర్, లాల్‌గడి మలక్‌పేట, అలియాబాద్ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.