మేడ్చల్ జోన్ బృందం,ఆగస్టు 21: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి రెండోసారి బీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం నియోజకవర్గంలో పలు చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ప్రజలంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పాలనలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరన్నారు. మంత్రి మల్లారెడ్డి సీఎం కేసీఆర్ చూపిన బాటలో నడుస్తూ అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. ఆయనను గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆచార్య జయశంకర్ చౌరస్తా వద్ద సోమవారం మల్లారెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకొని, సంబురాలు జరుపుకున్నారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి విష్ణుచారి, రాఘవేంద్రనగర్ కాలనీ అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, శేఖర్, విష్ణుచారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, దుర్గం వెంకటేశ్,శంకర్ ముదిరాజ్, రమేశ్ రెడ్డి, సచిన్, సందేశ్, చంద్రారెడ్డి, పవన్ పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీ నారపల్లి వరంగల్ ప్రధాన రహదారిపై మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, చైర్మన్ కొండల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, చైర్మన్ పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యం లో నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పం చుకున్నారు.
జవహర్‌నగర్‌లో డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. కార్యక్రమంలో కార్పొరేటర్లు రవి,శ్రీనివాస్‌రెడ్డి, రాజ్‌కుమార్, వేణు పాల్గొన్నారు.
శామీర్‌పేట మండలంలోని అలియాబాద్, మజీద్‌పూర్, శామీర్‌పేట గ్రామాల్లో రైతుబంధు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీటీసీల మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్ ఆధ్వర్యం లో బీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నారు. సు దర్శన్, సర్పంచ్ మోహన్‌రెడ్డి,యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, దళితసేన మండల అధ్యక్షుడు మురళి, వార్డు సభ్యులు మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్ ఆధ్వర్యంలో పటా కుల కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు, గ్రామ ఉప సర్పంచ్ పెంటమ్మ, పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు జగన్‌రెడ్డి, సంతోష్ బాను, సదానంద్ గౌడ్, సుదర్శన్‌రెడ్డి, కృష్ణ, విష్ణు, రాజగోపాల్‌రెడ్డి, వాజిద్, హరి, విగ్నేష్ పాల్గొన్నారు.