పీర్జాదిగూడ, నవంబర్ 19: ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసినం..కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి ప్రజలను అభ్యర్థించారు. గత ప్రభుత్వాల కంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్రంలో మారుమూల గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిందని చెప్పారు. ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి,మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల బీఆర్ఎస్ పై ఉన్న ఆదరణ చూస్తుంటే ఎన్నికల్లో ఘన విజయం ఖాయమన్నారు.
నియోజకవర్గంలో గతంలో ఉన్న అభివృద్ధి, ప్రస్తుతం తాను చేస్తున్న అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని సూచించారు. కాంగ్రెసోళ్లు పెద్దపెద్ద మాట లు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క రోైడ్డెనా వేయించిండా, ఒక్కసారైనా మీ ప్రాంతానికి వచ్చిండా… నయా పైసా అయిన అభివృద్ధి పనులు చేసిండా.. అలాంటి పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దని మంత్రి మాల్లారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో పీర్జాదిగూడలోని ప్రాంతాలు నీరులేక ఎన్నో ఇబ్బందుల పడ్డారని, ఇప్పుడు ఇంటింటికి నీరు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. అభివృద్ధి సంక్షేమం అందిస్తున్న బీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కులేదా…నాలుగున్నర ఏండ్లలో నియోజకవర్గం ప్రజలకు ఓ సేవకుడిగా, ఓ సైనికుడిగా, ఓ వాచ్‌మెన్‌గా ఏ బాదొచ్చినా, సమస్య వచ్చినా…నిత్యం ప్రజల్లో ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ సేవలందిస్తున్నామని తెలిపారు. తనను మరోసారి ఆదరిస్తే మున్సిపల్‌ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శామీర్‌పేట, నవంబర్ 19: అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలను కోరారు. శామీర్‌పేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఆదివారం మంత్రి మల్లా రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాకప్పి ఆహ్వానించారు. పొన్నాల్ గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 60 మంది బీఆర్ఎస్ పార్టీలో చేర గా, శామీర్‌పేట గ్రామంలో ముదిరాజ్, ఎరుకల సంఘాల నుంచి 200ల మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ఆజయలక్ష్మి, ఉపసర్పంచ్ రమేశ్‌యాదవ్, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, డైరెక్టర్ భూమిరెడ్డి, కీసర గుట్ట మాజీ సభ్యుడు వేణుగౌడ్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, నవంబర్ 19: కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టాలనే దుర్బుద్ధితో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి ప్రజలకు సూచించారు. మండల పరిధి ఎదులాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు భద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు.కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, సర్పంచ్ సురేశ్, మాజీ ఎంపీటీసీ రవి, సహకార సంఘం డైరెక్టర్ ధర్మారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.