బోడుప్పల్,ఏఫ్రిల్2:ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోడుప్పల్ నగరపాలక సంస్థ చెంగిచర్ల 2వ డివిజన్ పరిధిలోని కనకదుర్గానగర్ కాలనీ ఫేజ్-1,2,3,4,5, అణుశక్తినగర్కాలనీ, జైశ్రీరాంనగర్, విజయ్‌పురి ఈస్ట్ కాలనీ,శ్రీహరి ఎన్క్లేవ్ కాలనీలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను డిప్యూటీ మేయర్ లక్ష్మీరవిగౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే పనిచేస్తున్నదని ఆయన ఆరోపించారు. మాది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని, బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతని, మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లని ఆయన స్పష్టం చేశారు.
కొన్ని సంవత్సరాలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రభుత్వ చిత్తశుద్ధి, స్థానిక కార్పొరేటర్,డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్ కృషితో కాలనీలకు తాగునీటి సౌకర్యం కలిగిందని కాలనీ ప్రతినిధులు సోమేశ్గౌడ్, సలహాదారులు నర్సింహారెడ్డి, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కాలనీల్లో ప్రధాన, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వసతిని కల్పించాలని మంత్రి మల్లారెడ్డికి కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో రోడ్లు, డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు చందర్‌గౌడ్, పద్మారెడ్డి, సుమన్‌నాయక్, కో ఆప్షన్ మెంబర్లు, పార్టీ ప్రధాన కార్యాదర్శి మీసాల కృష్ణ్ర,స్థానిక నాయుకులు రవిగౌడ్, జంగారెడ్డి, శ్రీధర్‌గౌడ్, గోపాల్‌గౌడ్, రాములు, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్, రమణ, కుమార్ ,వాటర్‌వర్క్స్ అధికారులు,కాలనీ మహిళలు పాల్గొన్నారు.