కీసర, నవంబర్ 4: ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లతు అవడం ఖాయమని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం యాద్గార్పల్లి మాజీ సర్పంచ్ అక్కపల్లి అర్జున్, ఆయనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు శనివారం మండల పార్టీ అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాలే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని తీసుకోస్తాయన్నారు. నియోజకర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని అన్నారు.
జోరుగా గడపగడపకు ప్రచారం
పీర్జాదిగూడ: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. శనివారం ప్రతి డివిజన్లలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు హరిశంకర్‌రెడ్డి, పోచయ్య, నవీన్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ప్రసన్న లక్ష్మీ శ్రీధర్‌రెడ్డి, అనంతరెడ్డి, శశిరేఖ బుచ్చియాదవ్, సుభాష్ నాయక్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం
బోడుప్పల్: బీఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయంతో పాటు మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిచామకూర మల్లారెడ్డికి భార్టీ మెజార్టీ ఖాయమని మేయర్ బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలే పార్టీని విజయతీరాలకు చేరుస్తాయని అన్నారు. ఆటపాటలతో ప్రజలతో మమేకమైతూ…సాగుతున్న బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో ప్రజలనుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు డిప్యూటీ మేయర్ కొత్త రవిగౌడ్ పేర్కొన్నారు.
గుండ్లపోచంపల్లిలో..
మేడ్చల్ రూరల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11, 13, 14 వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియన్ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లోని కాలనీల్లో నాయకులు ఇంటింటికీ తిరిగి అభివృద్ధ్ది, పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించి కారుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జైపాల్‌రెడ్డి, మల్లికార్జున్ ముదిరాజ్, బాలరాజు, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సంజీవగౌడ్, నాయకులు జనార్దన్‌రెడ్డి, శ్రీహరి, సురేందర్ గౌడ్, ప్రవీణ్, జగన్, హరి, మహేశ్, నర్సింగ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు ఓటుతో సమాధానం చెప్పాలి
ఘట్కేసర్ రూరల్:కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగేలా ఓటుతోనే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చామకూర భద్రారెడ్డి కోరారు. మండల పరిధి వెంకటాపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని భద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని అన్నారు. కొర్రెముల గ్రామంలో సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ప్రతాపసింగారం గ్రామంలో సర్పంచ్ శివశంకర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, వెంకటాపూర్ సర్పంచ్ గీత శ్రీనివాస్, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్, నాయకులు నాగార్జున, యాదగిరి పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం
మేడ్చల్, నవంబర్ 4: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో నాయకులు, కౌన్సిలర్లు శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. 24 గంటల కరెంట్, ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
శామీర్‌పేట: శామీర్‌పేట మండలం అలియాబాద్, మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార కార్యాలయాలను బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి, అలియాబాద్, శామీర్‌పేట, తదితర గ్రామా ల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టి గడప గడపన బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూభాయిబాబు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్‌రెడ్డి, సర్పంచ్‌లు బాలమణి, కుమార్‌యాదవ్, ఆంజనేయులు, ఎంపీటీసీలు శ్రీనివాస్‌యాదవ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.