చిక్కడపల్లి, అక్టోబర్ 29: జలమండలి ఉద్యోగులకు ఐటీఐలో అవకాశం కల్పించి, సర్టిఫికెట్ ఇప్పించాలని టీఆర్ఎస్కేవీ వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్ శుక్రవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏండ్ల తరబడి ఒకే కేటగిరీలో ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు రావడం లేదని.. ఇలాంటి వారికి ఐటీఐలో శిక్షణ ఇప్పించాలన్నారు. ఈ డిమాండ్‌కు మంత్రి సానుకూలంగా స్పందించి.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ పి.నారాయణ, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, ప్రభాకర్, యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ జాంగీర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్తర్ అలీ, లక్ష్మీనారాయణ, రామచంద్రారెడ్డి, సి.రాజు, లక్ష్మణ్, ఎల్లయ్య, మేడ్చల్ శ్రీనివాస్, నర్సింగ్ రావు, మొగులయ్య, అజయ్ పాల్గొన్నారు.