మారేడ్‌పల్లి, అక్టోబర్ 2 : మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ పార్కులో అగర్వాల్ సమాజ్ సమితి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డిలు హాజరై పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ సభ్యురాలు నళిని కిరణ్, అగర్వాల్ సమాజ్ సమితి ప్రెసిడెంట్ వికాస్ కుమార్, పాండు యాదవ్, ప్రవీణ్, రాజు, అలోక్ జైన్, రమేష్, సోమయ్య పాల్గొన్నారు.