
ఎల్బీనగర్, అక్టోబర్ 23 : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్లీనరీని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం టీఆర్ఎస్ భవన్లో ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీతో అంతా గులాబీమయంగా మారాలన్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల వారు ఆదివారం డివిజన్ల స్థాయి పార్టీ సమావేశాలు నిర్వహించుకుని ఈ నెల 25వ తేదీన జరిగే ప్లీనరీ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ప్లీనరీ సమావేశం అనంతరం అక్టోబర్ 27వ తేదీన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకుని నవంబర్ 15న వరంగల్‌లో జరిగే సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించి విజయవంతం చేయాలన్నారు.
సమావేశంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, మాజీ కార్పొరేటర్లు జీవీ సాగర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్, కొప్పుల విఠల్‌రెడ్డి, సామ తిరుమల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న, రమావత్ పద్మానాయక్, సామ రమణారెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, భవాని ప్రవీణ్‌కుమార్‌తో పాటుగా డివిజన్ల అధ్యక్షులు లింగాల రాహుల్‌గౌడ్, తూర్పాటి చిరంజీవి, చెన్నగోని శ్రీధర్‌గౌడ్, చింతల రవికుమార్, సత్యంచారి, రాజిరెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, జక్కల శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు వజీర్ ప్రకాశ్‌గౌడ్, రాజారెడ్డి పాల్గొన్నారు.