
చిక్కడపల్లి : టీఆర్ఎస్కేవీ అనుబంధ వాటర్ వర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు గురువారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్‌ను, ఖైరతాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దానకిశోర్‌ను వేర్వేరుగా కలిశారు. వాటర్ వర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ నేతృత్వంలో జలమండలి ఉద్యోగుల పీఆర్సీపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబుయాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంతకం పూర్తి చేసి పీఆర్సీతో పాటు ఏరియర్స్ కూడా విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు.
ఉద్యోగులు అధైర్యపడొద్దని బకాయిలు బోర్డు ఖాతాలోనే ఉన్నందున ఒకేమొత్తంలో ఇచ్చే విధంగా కృషి చేస్తానని ఎండీ దానకిశోర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ జహంగీర్, యూనియన్ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.నారాయణ, జనరల్ సెక్రటరీ జయరాజ్, వరింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అక్బర్ అలీ, జి. లక్ష్మీనారాయణ, రామచంద్రారెడ్డి, సి. రాజు, చంద్రశేఖర్, ఎసే యాస్మిన్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.