అమరావతి : ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్‌లో ఐదుగురు నల్గొండ పర్యాటకులకు ( Nalgonda Tourists ) తృటిలో ప్రాణాపాయం తప్పింది. బీచ్ లైఫ్‌గార్డులు (Beach Lifeguards) సకాలంలో స్పందించడంతో కొట్టుకుపోతున్న వారిని సురక్షితంగా కాపాడారు.
నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన స్నేహితులు బుధవారం విశాఖ ఆర్కే సముద్రతీరంలో స్నానం చేస్తుండగా భారీ అలలతో కొట్టుకుపోయారు. గమనించిన జీవీఎంసీ లైఫ్గార్డు ఎం.ధనరాజ్‌తో పాటు మరికొందరు సముద్రంలోకి వెళ్లి పర్యాటకులను కాపాడారు. దీంతో నల్గొండ పర్యాటకులకు ప్రాణగండం తప్పడంతో లైఫ్గార్డు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.