శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.