సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.80కోట్లతో నిర్మించిన ఎంఎన్‌జే అత్యాధునిక బ్లాక్‌ను ఆదివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. సెల్లార్, లోయర్ గ్రౌండ్, గ్రౌండ్+5 అంతస్తుల్లో మొత్తం 300 పడకల సామర్థ్యంతో 30 వార్డులు, 2ఆపరేషన్ థియేటర్లు, 12 కన్సల్టేషన్ గదులు, 2 రేడియాలజీ బంకర్లు, 8 బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ గదులు, డెడికేటెడ్ పీడియాట్రిక్, అడోల్సెంట్ ఐసీయూలు, ఆక్సిజన్ పైప్లైన్లు వంటి అత్యాధునిక పద్ధతిలో ఈ బ్లాక్‌ను నిర్మించారు.