కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు.. డాక్టర్‌పై వేటు
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయం మంత్రి హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్లి.. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.
ఈ క్రమంలో కొంత మంది వ్యక్తులు మంత్రిని కలిసి.. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డాక్టర్ మూర్తి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై హరీశ్‌రావు అక్కడికక్కడే విచారణ చేపట్టి.. డాక్టర్ మూర్తిని సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.
సాధారణ డెలివరీలు పెంచాలి..
గైనకాలజీ వార్డును కూడా మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. గైనకాలజీ వార్డుల్లో నిత్యం స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇందుకు అదనంగా మరో రెండు అల్ట్రా సౌండ్ యంత్రాలు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని హరీశ్‌రావు సూచించారు.
కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు.. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్న డాక్టర్ మూర్తిని సస్పెండ్ చేసిన మంత్రి. pic.twitter.com/dI0Lg1PaZ9
— Namasthe Telangana (@ntdailyonline) May 23, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

