ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు : మంత్రి హరీశ్‌రావు
Mana Ooru Mana Badi | మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్ : మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రగతి నగర్లో ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, మేయర్ నీలా గోపాల్ రెడ్డి, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునిక వసతులు కల్పించిన అనంతరం 700 ప్రభుత్వ పాఠశాలలను ఒకే రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రోగ్రామ్‌కు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఒక వైపు నాణ్యమైన బోధన అందిస్తూనే, మరో వైపు వసతుల కల్పన చేపట్టామన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించామన్నారు. డిజిటల్ క్లాసులు పిల్లలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. స్కూల్ పిల్లలకు శానిటేషన్ కిట్స్ ఇవ్వబోతున్నాం. వారం పది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని తెలిపారు. 9 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నాం. ప్రమోషన్లు పూర్తి కాగానే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపట్టబోతున్నామని చెప్పారు. ఉపాధ్యాయులు పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన పెంచాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించాలి. ఎంబీబీఎస్ సీట్లు పొందాలి, అత్యున్నత స్థాయికి ఎదగాలని మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | కీర్తి సురేశ్ ‘సత్యవాన్ సావిత్రి’కి ఊహించని ఓపెనింగ్స్.. తొలి రోజే షాక్!
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

