హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిం సోమేశ్ కుమార్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిత కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. ఇటీవలే సోమేశ్ కుమార్ తల్లి మీనాక్షి సింగ్ మరణించారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమేశ్ కుమార్ ఇంటికి వెళ్లి మీనాక్షి సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సీఎస్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.