Asaduddin Owaisi | మలక్పేట, మే 1: ఆదరించి గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత మలక్పేట డివిజన్లోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పాత బస్తీ ప్రజలకు ఎంఐఎం రక్షణగా ఉంటుందని, పాత బస్తీని కొత్త నగరానికి ధీటుగా అభివృద్ధి పరిచే బాధ్యత తనదని పేర్కొన్నారు. బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మార్చి భాగ్యనగరంగా మారుస్తామని అంటున్నారని, ఎవడి అబ్బ సొత్తని పేరు మారుస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.