మెహిదీపట్నం, డిసెంబర్ 3 : నాంపల్లి ఎన్నికల ఫలితంలో ఉత్కంఠ పోరులో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ మాజిద్ హుస్సేన్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫెరోజ్ఖాన్పై విజయం సాధించారు. ఆదివారం మాసాబ్‌ట్యాంక్ జేఎన్ఎఫ్యూలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో జరిగిన ఓట్ల లెక్కింపు రౌండ్, రౌండ్‌కు మారుతున్న సమీకరణల్లో చివరి రౌండ్ వరకు గెలుపు ఇరు పార్టీలతో దోబుచులాడుకున్నది. చివరిగా 21 వ రౌండ్లో ఫలితం తేలింది. నాంపల్లి ఎమ్మెల్యేగా మాజిద్ హుస్సేన్ 2,175 ఓట్లతో విజయం సాధించారు. మాజిద్ హుస్సేన్‌కు 62, 063 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ ఫెరోజ్ఖాన్కు 59,888 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 3,32,764 ఓట్లలో 1,51, 595 ఓట్లు పోలయ్యాయి.ఓట్ల లెక్కింపును 14 టేబుళ్లతో 21 రౌండ్లలో చేపట్టారు.
కౌంటింగ్ ప్రారంభాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ చేపట్టారు. మొదటి 5 రౌండ్ల వరకు కాంగ్రెస్ స్వల్ప ఓట్ల మెజార్టీ ముందంజలో ఉండగా, 6 వ రౌండ్ నుంచి ఎంఐఎం 17 వ రౌండ్ వరకు ఏకధాటిగా మెజార్టీలో కొనసాగింది. ఒక 17 వ రౌండ్ తప్పించి మిగితా 4 రౌండ్లలో తిరిగి ఎంఐఎం పుంజుకున్నది. 21 రౌండ్లో విజయం తేలింది. బీఆర్ఎస్ అభ్యర్థి సీహెచ్.ఆనంద్‌కుమార్ గౌడ్ 15,378 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాహుల్ చంద్రకు 11,163 ఓట్లు పోలయ్యాయి.
కార్వాన్, డిసెంబర్ 3 : ఏఐఎంఐఎం కార్వాన్ అభ్యర్థి కౌసర్ మొహినుద్దీన్ గెలుపొందారు. ఆదివారం మాసాబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభకాగా.. సాయంత్రం 6 గంటల వరకు సాగింది. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 24 రౌండ్లుగా ఓట్లను లెక్కించారు. 1వ రౌండ్ నుంచి 14వ రౌండ్ వరకు ఆధిక్యత చాటిన బీజేపీ అభ్యర్థి అమర్ సింగ్ 12వ రౌండ్లో అత్యధికంగా 12,907 ఓట్ల ఆధిక్యం సాధించారు. 14 వ రౌండ్లో 3649 ఓట్ల లీడ్‌ను తీసుకున్నారు. అయితే 15వ రౌండ్లో 2226 ఓట్లతో తన ఆధిక్యతను ప్రారంభించిన కౌసర్ మొహినుద్దీన్ ప్రతి రౌండ్‌కు అంతకంతకు ఆధిక్యతను ప్రదర్శిస్తూ తన విజయాన్ని ఖాయం చేసుకున్నారు.
ఈ సందర్బంగా కార్వాన్ రిటర్నింగ్ అధికారి డి. కొమరయ్య ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్‌కు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కార్వాన్ నియోజకవర్గంలో 3,54,905 ఓటర్లు ఉండగా 48.72 శాతం నమోదవడంతో 1,75,865 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎంకు 83,388 ఓట్లు, బీజేపీకి 41, 088, బీఆర్ఎస్కు 29,194, కాంగ్రెస్‌కు 18,160 ఓట్లు పోలయ్యాయి.