మెట్రోలో కరోనా నియంత్రణకు మెట్రో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మెట్రో రైలును ప్రతి రోజు శానిటైజ్ చేయడంతో పాటు ప్రతి మెట్రో స్టేషన్లో ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద భద్రతా సిబ్బందితో థర్మామీటర్‌తో తనిఖీ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా చేయడం, చేతులను శానిటైజ్ చేసుకునేలా చూస్తున్నారు. టిక్కెట్ కౌంటర్ల వద్ద సైతం రద్దీ లేకుండా కాంటాక్ట్ లెస్ టికెట్ కోసం క్యూలో, మొబైల్ యాప్‌లోనే మెట్రో టిక్కెట్ల కొనుగోలు వంటి ఏర్పాట్లను ఎల్ అండ్ టీ మెట్రో ఏర్పాటు చేసింది.