ప్యాట్నీ-శామీర్‌పేట.. ప్యారడైజ్-కండ్లకోయ.. ఫ్లై ఓవర్ ప్రాజెక్టులో కదలిక
నగరంలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో అత్యంత కీలకమైంది ప్యాట్నీ నుంచి శామీర్‌పేట వరకు ఒక ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించింది.
- నగరాభివృద్ధిలో ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి
- కేంద్ర రక్షణ శాఖ మంత్రితో సమావేశం.. సానుకూల స్పందన
- క్షేత్రస్థాయి పరిస్థితులతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న హెచ్ఎండీఏ
- గత ప్రభుత్వం సరికొత్తగా డబుల్ డెక్కర్ తరహాలో నిర్మించాలని నిర్ణయం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : నగరంలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో అత్యంత కీలకమైంది ప్యాట్నీ నుంచి శామీర్‌పేట వరకు ఒక ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. దీనికోసం ఐదేండ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్యాట్నీ-శామీర్‌పేటతో పాటు ప్యారడైజ్-కండ్లకోయ మార్గంలోనూ రెండు మార్గాల్లో ఫ్లై ఓవర్లను నిర్మించాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. కాగా వీటిని సరికొత్తగా డబుల్ డెక్కర్ తరహాలో రోడ్డు మార్గం, మెట్రో మార్గం ఉండేలా నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.5 వేల కోట్లగా అంచనా వేశారు. నగరాభివృద్ధిలో ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణకు రక్షణ శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుపై కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కీలకమైన ప్రాజెక్టును చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రితో సమావేశమయ్యారు.
ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి ఎంతో కీలకమైన ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన భూముల విషయంపై కేంద్ర మంత్రితో చర్చించారు. కేంద్రం సానుకూలంగా స్పందించడంతో హెచ్ఎండీఏ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్యాట్నీ నుంచి అల్వాల్ మీదుగా శామీర్‌పేట వైపు ప్రతిపాదనలో ఫ్లై ఓవర్ నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఈ మార్గంలో అవసరమైన రక్షణ శాఖ భూములతో కూడిన వివరాలతో ప్రత్యేక నివేదికను సిద్ధం చేస్తున్నారు. సుమారు 5 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫ్లై ఓవర్ల నిర్మాణంలో కదలిక వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేంద్రంగా ఉన్న రక్షణ శాఖ ఉన్నతాధికారులతోనూ ైప్లె ఓవర్ నిర్మాణం విషయమై చర్చిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఎంత స్థలం అవసరం ఉంటుంది. భద్రతా పరంగా రక్షణ శాఖ ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకొని తుది ప్రతిపాదనలు రూపొందిస్తామని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

