కొండాపూర్, జూన్ 11: రోగి-కేంద్రీకృత సంరక్షణలో గణనీయమైన ముందడుగు వేస్తూ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ రోబోటిక్ సర్జరీ యూనిట్, 15 మంది నిపుణులైన సర్జన్ల బృందం 6 నెలల వ్యవధిలో 500కి పైగా రోబోటిక్-అసిస్టెడ్ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేసిందని మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ తెలిపారు. బుధవారం దవాఖానలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘మెడికవర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్లో సాంకేతికతను మానవ సంరక్షణకు ప్రత్యామ్నాయంగా కాకుండా, దానిని విస్తరించడానికి ఒక సాధనంగా చూస్తామన్నారు.
ప్రతి రోగి సురక్షితమైన, కనిష్టంగా ఇన్వాసివ్ విధానాలు, ప్రారంభ మొబిలైజేషన్, మెరుగైన జీవన నాణ్యత నుంచి ప్రయోజనం పొందేలా చూసుకోవడంపై మా దృష్టి ఉంటుందన్నారు. క్యాన్సర్, జనరల్ సర్జరీలు, యురాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి విభాగాల్లో 6 నెలల కాలంలో 500కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దవాఖానలోని పలు విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.